సుప్రీంకోర్టు తలుపు తట్టిన జన నాయకుడు

January 14, 2026


img

సినిమాలలో హీరో ఓ బ్యాక్ గ్రౌండ్ పాట పూర్తయ్యేలోగా ఐఎస్, ఐపీఎస్ అధికారి కాగలదు. న్యాయవాది కాగలడు. రాజకీయ నాయకుడుగా రాష్ట్రాన్ని దేశాన్ని చకాచకా అభివృద్ధి చేసి చూపగలడు.

కానీ నిజ జీవితంలో ఆ సినిమా విడుదల చేసుకోవడానికి ప్రభుత్వం, కోర్టులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరగాల్సివస్తుంది. ఇందుకు కోలీవుడ్‌ హీరో విజయ్‌ దళపతి నటించిన తాజా చిత్రం జన నాయకుడు చక్కటి ఉదాహరణ. 

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పేసి తమిళనాడు రాజకీయాలలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే జన నాయకుడుకి ఊహించని సమస్యలు తెచ్చిపెట్టింది. జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో రిలీజ్ చేసుకోలేకపోయారు.

మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జ్ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ, డివిజన్ బెంచ్‌ స్టే విధించడంతో ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. కనుక ‘జన నాయకుడు’ భవిష్యత్‌  సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష