రాజాసాబ్ రన్ టైం 3 గంటలా... అబ్బో!

January 06, 2026


img

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఈ నెల 9న వస్తున్న ‘ది రాజసాబ్’ రన్ టైమ్‌ ఏకంగా మూడు గంటల తొమ్మిది నిమిషాలు. గతంలో బాహుబలి కూడా ఇలాగే మూడు గంటల రన్ టైమ్‌తో వచ్చింది.

కానీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే మొదట స్ట్రెయిట్ తెలుగు సినిమాగా మొదలుపెట్టి తర్వాత పాన్ ఇండియా స్థాయికి మారడంతో అందుకు అవసరమైన హంగులన్నీ జోడించాల్సి వచ్చింది. కనుక రన్ టైమ్‌ మూడు గంటలు దాటిపోయింది.

ఈ కంటెంట్‌తో దర్శకుడు మారుతి, ప్రభాస్‌ కలిసి ప్రేక్షకులను మూడు గంటల సేపు థియేటర్లో కూర్చోపెట్టగలరా లేదా? అనేది జనవరి 8న ప్రీమియర్ పడగానే తెలిసిపోతుంది. కానీ వారు ప్రేక్షకులకు దాదాపు అర్ధగంట సినిమా ఉచితంగా చూపుతున్నట్లే భావించవచ్చు. 

ఈ సినిమాలో ప్రభాస్‌కు ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఉన్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్ ముఖ్యపాత్రలు చేశారు.  

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష