ఈ సంక్రాంతికి అసలు పండుగతో పాటు సినిమా పండుగ కూడా జరుపుకోబోతున్నారు తెలుగు సినీ ప్రేక్షకులు. ఈ పండుగలకు వారం రోజుల ముందే టీజర్, ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లతో సినీ పండుగను మొదలుపెట్టేస్తున్నారు.
రేపు అంటే జనవరి 7న హైదరాబాద్‌లో మన శంకర వరప్రసాద్ గారు ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. దీనిలో చిరంజీవి, వెంకటేష్ పాల్గొనబోతున్నారు. కనుక దీనికి ‘మెగా విక్టరీ ప్రీ-రిలీజ్ ఈవెంట్’ అని పేరు పెట్టారు.
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా రేపే... హైదరాబాద్‌లోనే జరుగబోతోంది. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్ర చేసిన ‘అనగనగా ఒక రాజుగారు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా రేపే.
వీటన్నిటితో పోలిస్తే బాహుబలి వంటి ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రేపే ఓ ప్రొమోషనల్ ఈవెంట్ కూడా రేపే జరుగబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ల హడావుడితో అందరూ సంక్రాంతి పండుగకు సిద్దమైపోవచ్చు. ముందుగా జనవరి 9న ప్రభాస్ ‘ది రాజా సాబ్’, విజయ్ దళపతి చివరి సినిమా జన నాయకుడు, జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు, జనవరి 13న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, జనవరి 14న ఉదయం నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజుగారు,’ అదేరోజు సాయంత్రం శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారీ’ వరుసగా విడుదలవుతున్నాయి.
వీటిలో ది రాజాసాబ్, జన నాయకుడు, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల ప్రీమియర్స్ ఒక రోజు ముందే పడతాయి. కనుక రేపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లతో సినిమా పండుగ మొదలైపోతుంది.