నారి నారీ నడుమ శ్రీవిష్ణు కూడా!

January 04, 2026


img

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా ‘నారి నారీ నడుమ మురారి’ సంక్రాంతి పండుగ రోజున అంటే జనవరి 14న ఫస్ట్ షోతో (సాయంత్రం 5.49 గంటలకు) విడుదల కాబోతోంది.

మరో పది రోజులలో సినిమా రిలీజ్ కాబోతుంటే సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ కొత్త విషయం చెప్పింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు కూడా నటించారని తెలియజేస్తూ నేడు చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేసింది. 

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం: రామ్ అబ్బరాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞాన శేఖర్, యువరాజ్ చేస్తున్నారు. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష