తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుని ఒక మాట అంటే శాసనసభ సమావేశాలు బహిష్కరించి బీఆర్ఎస్ సభ్యులను తీసుకుపోతారా? ఆయనకి కేసీఆర్ పిలిచి డెప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిస్తే ఇలా చేస్తారా?
ఆయన తీరు ఎలా ఉందంటే కుక్క తోకని ఊపడం కాదు తోకే కుక్కని ఊపుతున్నట్లుంది. ఇందుకే బీఆర్ఎస్ పార్టీలో ఆయనో గుంటనక్క అని నేను పదేపదే చెపుతున్నా. సభలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కేసీఆర్‌ని అన్నేసి మాటలు అంటుంటే హరీష్ రావుకి తప్పుగా అనిపించలేదు. కానీ తనని ఒక మాటనేసరికి రోషం వచ్చింది.
శాసనసభ సమావేశాలలో అధికార ప్రతిపక్షాలు మాట మాట అనుకోవడం సహజం. అంతమాత్రన్న శాసనసభ సమావేశాలని బహిష్కరించి వెళ్ళిపోతారా? అలా వెళ్ళిపోయి శాసనసభలో ప్రతిపక్షం గొంతు వినపించాకుండా చేశారు. సభలో కాంగ్రెస్ మంత్రులు నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతుంటే ఖండించేందుకు సభలో ప్రతిపక్షమే లేకుండా చేశారు హరీష్ రావు.
సభలో ఒక అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు అధికార పార్టీతో విభేదిస్తే వాకవుట్ చేసి బయటకొచ్చేయవచ్చు. కానీ దాని తర్వాత అంశంపై చర్చ మొదలైనప్పుడు దానిలో ప్రతిపక్షం పాల్గొనాలి కదా? మూసీ ప్రక్షాళన తర్వాత జిహెచ్‌ఎంసి పునర్విభజనపై చర్చ జరిగింది.
రాష్ట్రంలో 1/3 వంతు జనాభా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంతమంది ప్రజలకు సంబంధించిన కీలక బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? అంటే హైదరాబాద్ ప్రజలకు సంబంధించి అంశంపై బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం కాదా?”అంటూ కల్వకుంట్ల కవిత హరీష్ రావుపై నిప్పులు చెరిగారు.
బిఅర్ఎస్ పార్టీనీ సర్వ నాశనం చేస్తున్న గుంట నక్క @BRSHarish.
— Jagruthi Talks (@jagruthi_Talks) January 4, 2026
కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే బిఅర్ఎస్ పార్టీనీ ఎవరు కాపాడలేరు.#KalvakuntlaKavitha #jagruthijanambaata #TelanganaJagruthi https://t.co/OFE5XcAulU pic.twitter.com/ByHWoc1JUr