అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్‌లో చిరంజీవి మార్క్ యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్, చివరిగా వెంకటేష్, చిరంజీవి ఇద్దరి పంచ్ డైలాగులతో అభిమానులను, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా దించారు. పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురుగా శశిరేకగా నయనతార, ఆమెని చూసి భయపడే అల్లరి భర్తగా మన శంకర వరప్రసాద్ గారిని పరిచయం చేశారు.
ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్‌తో చెప్పేశారు. కనుక ఏదో అద్భుతాలు ఆశించి వెళితే నిరాశ తప్పదు.
ఈ సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి పండుగకి రెండు రోజుల ముందే అంటే ఈ నెల 12న వచ్చేస్తున్నారు.