మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో ‘టాక్సిక్’ అనే సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా సబ్ టైటిల్: ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్.’
ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు గంగ చాలా ట్రెడిషనల్ కానీ మనిషి మాత్రం చాలా టాక్సిక్ అని ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చెప్పేశారు. మోడ్రన్ డ్రెస్సులో తుపాకీ చేత్తో పట్టుకొని ఓ క్యాసినోలోకి వెళుతున్న ఫోటోని ఫస్ట్ లుక్ పోస్టర్‌గా విడుదల చేశారు. ఈ సినిమాలో రెబెక్కాగా కీలకపాత్ర చేస్తున్న తారా సుతారియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదల చేశారు. ఆమె కూడా మోడ్రన్ డ్రస్ వేసుకొని చేతిలో తుపాకీతో ఎవరికో గురిపెట్టినట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపారు.
ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు యష్ కీలకపాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ కూడా ముఖ్యపాత్రలు చేస్తున్నారు. నయనతార పాత్ర పేరు గంగ, కియరా అద్వానీ పాత్ర పేరు నదియా, ఖురేషీ పాత్ర పేరు ఎలిజబెత్ అని ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తెలియజేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి మార్చి 19న విడుదల చేయబోతున్నారు.