బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో అఖండ-2 గత నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాలయ్య అభిమానులను అలరించేవిధంగా సినిమా తీయడంతో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అఖండ-2 గట్టెక్కిపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు జనవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
సంయుక్త, ఆదిపినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు ముఖ్యపాత్రలు చేసిన అఖండ-2కు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంటలతో కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అఖండ-2 నిర్మించారు.