అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ జనవరి 4న అని ప్రకటించేశారు. కానీ ఎప్పుడు ఎక్కడ? అనేది చెప్పలేదు. నేడు అది కూడా చెప్పేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి పట్టణంలో ఎస్‌వీ సినీ పరిశ్రమ ప్లెక్స్‌లో ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది. ట్రైలర్ 2.30 నిమిషాల నిడివి ఉంటుంది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో చేశారు. చిరంజీవి, వెంకటేష్ కలిసి చేసిన ‘మెగా విక్టరీ’ ఆట,పాట కూడా ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారని అనిల్ రావిపూడి సినిమా మొదలుపెట్టిన రోజే చెప్పేశారు. చెప్పినట్లుగానే ఈ నెల 12న సంక్రాంతి పండుగకి రెండు రోజుల ముందు మన శంకర వరప్రసాద్ గారిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.