సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా చేసిన ‘గోదారి గట్టుపైన’ టీజర్ విడుదలైంది. పచ్చటి చెట్లు, పంటలతో అందాలొలికే గోదావరి జిల్లాలో అలరించే ఓ ప్రేమ కధ ఇది. ప్రేమ కధ నేపధ్యంలో గోదావరి జిల్లాలలోని జీవనశైలిని దర్శకుడు సుభాష్ చంద్ర చూపించబోతున్నాడని టీజర్‌తో స్పష్టం అయ్యింది.
ఈ సినిమాలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైల, దేవీ ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సుభాష్ చంద్రం సంగీతం: నాగ వంశీ, కెమెరా: సాయి సంతోష్, స్టంట్స్: కార్తిక్ డంగ్రి, ఎడిటింగ్: అనిల్ పాశాల చేశారు.
ఏసియన్ సినిమాస్ సమర్పణలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ రావు నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.