పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సమస్యలు, వివాదాను ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నిటినీ అధిగమించి సజావుగా ఎన్నికలు నిర్వహించి, దాదాపు 50 శాతం పైగా గెలుచుకుంది.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించింది. జనవరి 10న తుది జాబితా ప్రకటించనుంది. కనుక సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
పంచాయితీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు దాదాపు 25 శాతం పైగా సీట్లు గెలుచుకున్నారు. అది ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. కనుక మున్సిపల్ ఎన్నికలలో కూడా సత్తా చాటాలని ఆరాటపడుతోంది. కనుక మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య గట్టి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.