కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ జనవరి 13న సంక్రాంతి పండగకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేసేందుకు వస్తున్నారు. మొన్న నూతన సంవత్సరం కానుకగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పోస్టర్ విడుదల చేశారు.
‘వామ్మో... వాయ్యో’ పాట ప్రమో కూడా విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు రవితేజతో సహా చిత్ర బృందం వరంగల్ భద్రకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని వాగ్దేవీ ఇంజనీరింగ్ కాలేజీ చేరుకుంటారు. సాయంత్రం 3.30 గంటల నుంచి ‘వామ్మో... వాయ్యో’ పాట లాంచింగ్ ఈవెంట్ జరుగబోతోంది.
రవితేజతో పాటు హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్, సునీల్, సత్య, శుభలేఖ సుధాకర్, మురళీధర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కిషోర్ తిరుమల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: ఈ సందర్భంగా ప్రకాష్ చేస్తున్నారు. ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.