ది ప్యారడైజ్‌ నుంచి జడల్ జమానా-2026 పోస్టర్!

January 02, 2026


img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్‌’ నుంచి నూతన సంవత్సర కానుకగా ‘జడల్ జమానా’ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో నాని పాత్ర పేరు ‘జడల్’, నాని లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రఫ్ అండ్ టఫ్ లుక్‌తో నాని ఫైట్ చేస్తున్న పోస్టర్ చాలా ఆకట్టుకుంటుంది.     

ఈ సినిమాలో నానికి జోడీగా సోనాలి కులకర్ణి నటిస్తుండగా, విలన్‌ ‘శికంజ మాలిక్’గా మోహన్ బాబు, ‘బిర్యాని’గా సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు.

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: తోట శ్రీనివాస్‌, కెమెరా: సిహెచ్ సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేస్తున్నారు.

దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాపై దర్శక నిర్మాతలకు చాలా భారీ అంచనాలున్నాయి. కనుక తొలిసారిగా బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష