తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అందరినీ ఎంతగానో అలరించింది. ఇప్పుడు అటువంటి ప్రేమ కధతోనే ‘బ్యాండ్ మేళం’ వస్తోంది.
‘కోర్ట్-వర్సస్ నో బడీ’ సినిమాలో నటించి మెప్పించిన యువనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి మళ్ళీ మరోసారి ‘బ్యాండ్ మేళం’ కోసం జత కట్టారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిద్దరి పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ.
ఈ సినిమాకి కధ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే: శివ ముప్పరాజు, సంగీతం: విజయ్ బులగనిన్, కెమెరా: సతీష్ ముత్యాల చేస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కాబోతోంది.
Team #BandMelam wishes everyone a very Happy New Year ✨🎶
May the year ahead move forward with love, music, and moments that stay close to the heart ❤️ @HarshRoshan7 #Sridevi @saikumaractor @konavenkat99 @SathishJavvaji @VijaiBulganin @boselyricist @pranav_sivaraju pic.twitter.com/WlbAAOqDsx