తెలంగాణ ప్రభుత్వం 2025 ముగుస్తున్న ఈ సమయంలో ఉద్యోగులకు ఓ శుభవార్త ప్రకటించింది. ఈ డిసెంబర్ నెలకు సంబంధించి పెండింగ్ బిల్లుల నిమిత్తం ప్రభుత్వం 713 కోట్లు విడుదల చేస్తోంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్ధికశాఖకజు ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొన్నేళ్ళుగా ఉద్యోగుల గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్సులకు సంబంధించి సుమారు రూ.10,000 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగ సంఘాలతో దీని గురించి చర్చించారు. అంత మొత్తం ఒకేసారి చెల్లించడం కష్టం కనుక ప్రతీ నెల రూ.700 కోట్లు చొప్పున విడుదల చేసేందుకు ఒప్పందం జరిగింది. ఈ మేరకు నేడు డిసెంబర్ వాయిదాగా ప్రభుత్వం 713 కోట్లు విడుదల చేస్తోంది.