నేడు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. కనుక నగరం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వాటిలో పాల్గొంటారు. అర్ధరాత్రి వరకు సాగే వేడుకలలో పాల్గొనడం ఎంత సంతోషం కలిగించినప్పటికీ అవి ముగిసిన తర్వాత క్షేమంగా ఇళ్ళకు చేరుకోవడం ఓ పెద్ద టాస్క్ అనే చెప్పాలి.
కనుక వారి సౌకర్యార్ధం హైదరాబాద్ మెట్రో ఈరోజు రాత్రి ఒంటి గంటకు చివరి సర్వీసు నడిపించబోతోంది. అది గమ్య స్థానం చేరుకోవడానికి సుమారు గంట సేపు పడుతుంది. కనుక రేపు తెల్లవారుజాము 2 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్న మాట!
మెట్రో సర్వీసులు నడిపించబోతోంది. కనుక నగర ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. టిజీఎస్ ఆర్టీసీ కూడా నేడు అర్ధరాత్రి వరకు బస్సులు నడిపించబోతోంది.