నేడు గిగ్ వర్కర్స్ మూడు గంటలు సమ్మె!

December 31, 2025
img

స్విగ్గీ, జొమోటో, బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర సంస్థలలో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్) ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు గంటల సేపు సమ్మె చేయబోతున్నారు.

వారు చాలా కాలంగా తమ కమీషన్లు పెంచాలని, పది నిమిషాలలో డెలివరీ విధానం రద్దు చేయాలని, ప్రమాద భీమా చేయాలని కోరుతున్నారు. కానీ ఆయా సంస్థలు స్పందించకపోవడంతో ఇటీవల క్రిస్మస్ పండుగరోజున ఇలాగే మూడు గంటలు సేవలు నిలిపివేసి నిరసన తెలియజేశారు.

కానీ వారి యాజమాన్యాలు స్పందించకపోవడంతో నేడు మరోసారి మెరుపు సమ్మె చేయబోతున్నారు. ఈ సంస్థలకు అత్యంత కీలకమైన వ్యాపార సమయం ఇదే. నూతన సంవత్సరం సందర్భంగా కోట్లాది మంది ఈ సంస్థల సేవలు వినియోగించుకుంటారు. కనుక గిగ్ వర్కర్ల మెరుపు సమ్మెతో యాజమాన్యాలు దిగివస్తాయో లేదో చూడాలి.

Related Post