నయనతార చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పూర్తి చేశారు. అది పూర్తి కాగానే మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా మొదలుపెట్టేశారు. ఈ సినిమా సబ్ టైటిల్: ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్.’
ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు గంగ చాలా ట్రెడిషనల్ కానీ మనిషి మాత్రం చాలా టాక్సిక్ అని ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చెప్పేశారు. మోడ్రన్ డ్రెస్సులో తుపాకీ చేత్తో పట్టుకొని ఓ క్యాసినోలోకి వెళుతున్న ఫోటోని ఫస్ట్ లుక్ పోస్టర్‌గా విడుదల చేశారు.
ఈ సినిమాలో నయనతారతో పాటు కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో నయనతార పాత్ర పేరు గంగ కియరా అద్వానీ పాత్ర పేరు నదియా, ఖురేషీ పాత్ర పేరు ఎలిజబెత్ అని తెలియజేశారు. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు యష్ కీలకపాత్ర చేస్తున్నారు. మార్చి 19న విడుదల కాబోతోంది.