మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా జనవరి 12న వస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ నుంచి మెగా విక్టరీ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.
కాసర్ల శ్రీరాం వ్రాసిన ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నకాష్ అజీజ్, విశాల్ డాడ్లానీ కలిసి హుషారుగా పాడారు. విజయ్ పోలక్కి కోరియోగ్రఫీ చేసిన ఈ పాటకి సంక్రాంతికి ఇరగదీద్దాం అంటూ ఇద్దరు హీరోలు హుషారుగా డాన్స్ చేశారు.
ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా క్యాథరిన్ చేస్తున్నారు. హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 12న సంక్రాంతి పండగకి ముందు విడుదల కాబోతోంది.