బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై హైడ్రా పిర్యాదు

January 02, 2026


img

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  బీఆర్ఎస్‌ ప్రభుత్వం దుర్గంచెరువుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దానిపై అంతకంటే అద్భుతమైన కేబిల్ బ్రిడ్జ్ నిర్మించింది. అప్పటి నుంచి నగర ప్రజలు, పర్యాటకులు అక్కడకు వస్తున్నారు.

బీఆర్ఎస్‌ హయంలో దుర్గంచెరువుని సుందరంగా తీర్చిదిద్దితే, ఆ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచరుడు ఒకరు చెరువుని కొంత మేర రాళ్ళు, మట్టితో పూడ్చి అక్కడ షెడ్లు వగైరా నిర్మించి పార్కింగ్ బిజినెస్ చేస్తున్నారు.

హైడ్రాకు పిర్యాదులు రావడంతో అది దుర్గంచెరువు పరిధిలో ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఎమ్మెల్యే అనుచరుడు నిర్మించిన షెడ్లు వగైరా కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. దుర్గంచెరువుని రాళ్ళు, మట్టితో పూడ్చి కబ్జా చేసి, పార్కింగ్ బిజినెస్ చేస్తున్నందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.  


Related Post