వారంలో లిక్కర్ సేల్స్: 1,350 కోట్లు!

January 01, 2026
img

క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గత ఆరు రోజులలోనే రూ. 1,350 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని సంబందిత శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల్లోనే 8.30 లక్షల లిక్కర్ క్రేట్స్, 7.78 లక్షల కేసులో బీర్లు అమ్మకాలు జరిగాయని తెలిపారు. న్యూ ఇయర్ హడావుడి ముగిసే సరికి మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. కనుక మరో వెయ్యి కోట్లు మద్యం అమ్మకాలు జరిగినా ఆశ్చర్యం లేదు. 

ఓ పక్క జోరుగా మద్యం విక్రయాలు జరుగుతూ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంటే, మరోపక్క మద్యం తాగి రోడ్లపైకి వస్తే హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరంల్నే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 2,731 మందిపై కేసులు నమోదు చేశారు. వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Related Post