పెద్ద సినిమాల మద్య విడుదలయ్యే కొన్ని చిన్న సినిమాలు గమనించేలోగా థియేటర్లలో నుంచి ఓటీటీలోకి వెళ్ళి మాయం అయిపోతుంటాయి. వాటిలో కొన్ని మంచి సినిమాలు ఉంటాయి. అలాంటిదే నీలకంఠ కూడా.
గ్రామీణ నేపధ్యంలో ప్రేమ, కట్టుబాట్లు, కబాడీ ఆటతో తెరకెక్కించిన ఈ సినిమా నేడే విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. .
ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, యష్ణ ముత్తులూరి జంటగా నటించారు. ఇంకా నేహా పతాన్, స్నేహఉల్లాల్, రాంకీ, బబ్లూ పృద్విరాజ్, శుభలేఖ సుధాకర్, భరత్ రెడ్డి, సత్య ప్రకాష్, చిత్రం శ్రీను, శివకార్తీక్ దండ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ,దర్శకత్వం: రాకేష్ మాధవన్, సంగీతం: మార్క్ ప్రశాంత్, కెమెరా, ఎడిటింగ్: శ్రావణ్ జి కుమార్, ఆర్ట్: నాని పండు, సతీష్ చేశారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం. శ్రీనివాసులు, డి.వేణుగోపాల్ కలిసి నిర్మించారు.