హైందవ నుంచి బెల్లంకొండ ఫస్ట్ లుక్ పోస్టర్‌

January 03, 2026


img

గత ఏడాది ‘కిష్కింద’ అందరినీ మెప్పించిన యువనటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ ఏడాది ‘హైందవ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లుదీర్ బైరెడ్డి దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

ఈ సినిమాలో బెల్లంకొండకి జోడీగా సంయుక్త నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి, మహేష్ మంజేకర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: లుదీర్ బైరెడ్డి, సంగీతం: లియాన్ జేమ్స్, కెమెరా: శివేంద్ర, ఆర్ట్: శ్రీనాగేంద్ర, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్‌ చేస్తున్నారు.  

మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష