భర్త మహాశయులకు విజ్ఞప్తి: రేపే ట్రైలర్‌

January 13, 2026


img

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్‌కి ముహూర్తం పెట్టేశారు. రేపు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్‌లో ఆర్ట్ సినిమాస్‌లో ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ మొదలవుతుంది. సాయంత్రం 4.05 గంటలకు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియాలో విడుదలవుతుంది.       

ఇటీవలే విడుదలైన ‘వామ్మో వాయ్యో’ లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌కి కూడా మంచి మార్కులు పడితే భర్త మహాశయులు ఇక చూసుకోవనవసరం లేదు.      

ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్‌, సునీల్, సత్య, శుభలేఖ సుధాకర్, మురళీధర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: ఈ సందర్భంగా ప్రకాష్ చేస్తున్నారు. ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.   


Related Post

సినిమా స‌మీక్ష