బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో అఖండ-2 ప్రీమియర్స్ ఈరోజు రాత్రి 9 గంటలకు విడుదల కాబోతోంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా అఖండ-2 విడుదలవుతుంది. ప్రీమియర్స్ పడితే సినిమా రిలీజ్ అయినట్లే భావించవచ్చు.
మరికొన్ని గంటలలో ప్రీమియర్స్ విడుదల కాబోతుండగా ఎవరూ ఊహించని విధంగా అఖండ-2 నుంచి ఓం శివ శివ అంటూ సాగే ఆడియో సాంగ్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. కళ్యాణ్ చక్రవర్తి వ్రాసిన ఈ పాటకి తమన్ సంగీతం అందించగా కనకవ్వ, శ్రుతి రంజని ఆలపించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంటలతో కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అఖండ-2 నిర్మించారు.
డిసెంబర్ 5న విడుదల కావాల్సిన అఖండ-2 అనివార్య కారణాల వలన చివరి నిమిషంలో వాయిదా పడి రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అఖండ-2పై చాలా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు అందుకోగలదో లేదో లేక వాటిని అధిగమించి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో ఈ రోజు ప్రీమియర్స్ పడితే తెలుస్తుంది.