పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలు థియేటర్లలో విడుదలై, ఓటీటీలోకి కూడా వచ్చి వెళ్ళి పోయాయి. ఓజీ సక్సస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓజీకి సీక్వెల్ చేస్తానని, మళ్ళీ సినిమాలలో నటిస్తానని చెప్పారు.
కానీ ఆయనకు సినిమాలు చేయాలని ఉన్నా ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులతో క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్న పవన్ కళ్యాణ్ కొత్తగా సినిమా చేయడం చాలా కష్టమే. కనుక ఇంత వరకు కొత్తగా మరో సినిమా ఒప్పుకోలేదు. కనుక అభిమానులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
వారికో శుభవార్త. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేక్‌లేంగే సాలా’ అనే తొలిపాట ప్రమో విడుదల కాబోతోంది. ఈ విషయం శ్రేయాస్ శ్రీనివాస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కనుక పాట ప్రమో ఖాయమే అని భావించవచ్చు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సన్నివేశాల షూటింగ్ పూర్తయిపోయింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు వస్తారేమో?
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి‘ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మిస్తున్నారు.