బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేసిన అఖండ 2: నుంచి తాండవం పాట రేపు విడుదల కాబోతోంది. అఖండ సూపర్ హిట్ అయినందున ఈ సినిమాపై నమ్మకంతో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించారు. కనుక ఉత్తరాదిన కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ముంబై, జుహూలో పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో శుక్రవారం సాయంత్రం ఈ సినిమాలోని ‘తాండవం’ పాట లాంచింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
14 రీల్స్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో అఖండ-2 నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.