దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా గత ఏడాది అక్టోబర్లో విడుదలైన లక్కీ భాస్కర్ సూపర్ హిట్ అయ్యింది. షేర్ మార్కెట్లో జరిగే లావాదేవీలు, మోసాలను వివరిస్తూ లక్కీ భాస్కర్ సినిమా కధ అల్లుకొని హిట్ కొట్టారు.
అసలు అలాంటి సంక్లిష్టమైన సబ్జెక్ట్ తీసుకొని సామాన్య ప్రేక్షకులకు కూడా అర్దమయ్యేలా చెప్పడమే చాలా కష్టం. కానీ దర్శకుడు వెంకీ అట్లూరి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా చాలా చక్కగా కధ చెప్పడమే కాకుండా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా తెలివిగా ఫ్యామిలీ స్టోరీని కూడా సినిమాలో ఇమిడ్చేరు. అందుకే లక్కీ భాస్కర్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
కనుక ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు వెంకీ అట్లూరి కధ రెడీ చేసుకుంటున్నారు. ఈలోగా వేరే జోనర్‌లో సినిమా చేయవచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు కానీ కుదిరితే కుటుంబ కధ చిత్రం చేస్తానని లేకుంటే లక్కీ భాస్కర్ సీక్వెల్ మొదలుపెడతానని అన్నారు. కానీ దీనికి కొంత సమయం పడుతుందని వెంకీ అట్లూరి చెప్పారు.