మహావతార్ నరసింహ నుంచి ప్రహ్లాద్ మహారాజ్ ప్రమో

July 04, 2025


img

అశ్విన్ కుమార్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమాలో రాక్షస రాజు ‘హిరణ్య కశిపు’ని ఇటీవల పరిచయం చేయగా ఇప్పుడు భక్త ప్రహ్లాదుడుని పరిచయం చేస్తూ మరో అద్భుతమైన ప్రమో విడుదల చేసింది. 

భక్త ప్రహ్లాద సినిమా చూడని తెలుగువారు ఉండరు. దానిలో హిరణ్య కశిపుడుగా ఎస్వీ రంగారావు, భక్త ప్రహ్లాదుడిగా రోజా రమణీ అద్భుతమైన నటన, ఆ పాటలు, పాత్రలు, సన్నివేశాలు ఎన్నటికీ మరిచిపోలేనివే.

భక్త ప్రహ్లాదలో ఎస్వీ రంగారావు నటన, దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరు ‘నభూతో న భవిష్యతి’ అని చెప్పవచ్చు. కనుక ఆ మహా నటుడు చేసిన ఆ పాత్రని ఈవిదంగా చూడటం అభిమానులకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మారుతున్న సమాజానికి తగ్గట్లు తీసిన యానిమేషన్ చిత్రం కనుక సర్దుకు పోవలసిందే. 

 ‘మహావతార్ నరసింహ’గా యానిమేషన్ సినిమాకి కధ: జయపూర్ణ దాస్, రుద్ర పి గోష్, అదనపు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రుద్ర పి గోష్, సంగీతం: శామ్ సి, ఎడిటింగ్: అజయ్ ప్రశాంత్ వర్మ, అశ్విన్ కుమార్‌, పాటలు: ది శ్లోక, సౌరభ్ మిట్టల్, ట్వింకిల్ చేస్తున్నారు. 

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శిల్పా ధావన్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు: ఎస్సీ ధావన్, దుర్గా బాలుజా. ఈ నెల 25న మహావతార్ నరసింహ విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష