వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. తాము 2018 లో ఈ టైటిల్‌తో సినిమా చేద్దామనుకున్నామని కానీ కుదరలేదని వేణు శ్రీరామ్ చెప్పారు.
అప్పటి నుంచి ఆ టైటిల్, స్టోరీ తన వద్ద అలాగే ఉండిపోయిందని చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోవడంతో ఆయనతో సినిమా చేసే పరిస్థితి లేదని ఒప్పుకున్నారు.
కనుక అదే టైటిల్, స్టోరీతో వేరే హీరోతో సినిమా చేయాలనుకుంటున్నట్లు వేణు శ్రీరామ్ చెప్పారు. కానీ తాను ఇంత వరకు ఆ కధ ఎవరికీ వినిపించలేదని చెప్పారు. తన కధకు తగిన హీరోని చూసుకొని సినిమా మొదలుపెట్టాలనుకుంటున్నాని వేణు శ్రీరామ్ చెప్పారు. అయితే ఎప్పుడు ఎవరితో అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు.
ఇక అల్లు అర్జున్-అట్లీ కలిసి ఓ భారీ సైంటిఫిక్ మూవీ మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ‘ఐకాన్’ టైటిల్ అయితే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కనుక వేణు శ్రీరామ్‌తో మాట్లాడి ఆ టైటిల్ తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ అదే టైటిల్‌తో వేరే హీరోతో సినిమా చేయాలని వేణు శ్రీరామ్ గట్టిగా అనుకుంటే మాత్రం బన్నీ సినిమాకి ఆ టైటిల్ దక్కకపోవచ్చు.