హరిహర వీరమల్లు ట్రైలర్‌….

July 03, 2025


img

జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రధానపాత్రలో చారిత్రిక నేపధ్యంతో తీసిన సినిమా ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ గురువారం ఉదయం 11.10 గంటలకు విడుదలైంది. మొఘలుల కాలంలో దేశ ప్రజల కోసం, హిందువుల కోసం వారితో పోరాడిన వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్‌ నటించారు. చరిత్ర, యుద్ధాలు అంటే యాక్షన్ సీన్స్ తప్పనిసరి కనుక ట్రైలర్‌లో అవే ఎక్కువ చూపారు.   

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటించగా, బాలీవుడ్ నటులు బాబీ డియోల్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో 5 భాషల్లో నిర్మించారు. అనేకసార్లు వాయిదా పడిన తర్వాత ఈ నెల 24న  హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/Qv-NEQJehVU?si=s1fBjYZxbhtuZ7bC" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష