నాగబాబు ఫ్యామిలీలోకి త్వరలో వారసుడు రాబోతున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో తల్లితండ్రులు కాబోతున్నారు. తన భార్య లావణ్య త్రిపాఠి గర్భం దాల్చిందని వరుణ్ తేజ్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టారు.
మాల్దీవులలో విహారయాత్రకు వెళ్ళిన వారిరువురూ అక్కడ సముద్రం ఒడ్డున ఓ కొబ్బరి చెట్టు వద్ద నిలబడినప్పుడు తీసుకున్న ఫోటోని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దానిలో ఆమె ‘బేబీ బంప్’తో కనపడింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రెండు సినిమాలలో కలిసి నటించినప్పుడు ప్రేమలో పడ్డారు. ఆరేళ్ళ ప్రేమ తర్వాత పెద్దల ఆమోదంతో 2023 లో పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ముందు ఒప్పుకున్న రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ పూర్తిచేసాక కొత్తగా మరేవీ ఒప్పుకోలేదు. వరుణ్ తేజ్ మాత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.