వెంకీ అట్లూరి, సూర్య సినిమా పూజా కార్యక్రమం

May 20, 2025


img

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు సూర్య, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ‘సూర్య 46’ వర్కింగ్ టైటిల్‌తో సినిమా మొదలైంది. సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముహూర్తం షాట్‌కి  క్లాప్ కొట్టి ప్రారంబించారు. ఈ సినిమాలో సూర్యకి జోడీగా మమిత బైజు నటించబోతుండగా, రాధికా శరత్ కుమార్‌, రవీనా టండన్ ముఖ్య పాత్రలు చేయబోతున్నారు.   

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత నాగ వంశీ చెప్పారు. జూన్ నెలాఖరులోగా షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష