ఇది మలయాళ ఈగ.. తెలుగు ఈగతో సంబంధం లేదట!

May 14, 2025


img

రాజమౌళి ‘ఈగ’ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో, అందులో ఈగ పాత్ర ఎంత అద్భుతంగా ఉందో అందరూ చూశారు. ఇప్పుడు మలయాళ సినిమా ‘లవ్లీ’లో కూడా ఓ ఈగ పాత్ర ఉంది. 

ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాథ్యూ థామస్ హీరోగా చేసిన లవ్లీ సినిమా ఈగ పాత్ర ఉంది. అయితే రాజమౌళి ఈగతో మా ఈగకు ఎటువంటి సంబందమూ లేదని చెప్పారు. ఓ ఈగతో మనిషికి మద్య ఏర్పడిన స్నేహాన్ని దర్శకుడు దిలేష్ కరుణాకరన్ అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. 

మాథ్యూ థామస్, ఉన్నిమాయ ప్రసాద్, మనోజ్ కె జయన్, ప్రశాంత్‌ మురళి తదితరులు నటించిన ఈ సినిమాకి కధ దర్శకత్వం:  దిలేష్ కరుణాకరన్ దిలేష్ కరుణాకరన్, సంగీతం: విష్ణు విజయ్ దేవరకొండ-బిజిబల్, కెమెరా: ఆషిక్ అబూ, సీజీఐ డైరెక్టర్: అనీష్ కుట్టి (లిటిల్ హిప్పో స్టూడియోస్), ఎడిటింగ్: కిరణ్ దాస్, ఆర్ట్: కృపేష్ అయ్యప్పన్ కుట్టి, యాక్షన్ కొరియోగ్రఫీ: కలై కింగ్‌సన్ చేశారు. 

వెస్ట్రన్ ఘాట్స్ ప్రొడక్షన్స్, నేనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై శరణ్య, డా. అమర్ రామచంద్రన్ కలిసి ఈ లవ్లీ సినిమా నిర్మించారు. ఈ సినిమా మే 16న మళయాళం, తెలుగులో విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/fRv-C8IvmI0?si=lOG3O1gHoDRzpLwB" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష