షష్టిపూర్తికి కూడా రాత్రంతా రచ్చే!

May 11, 2025


img

ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, కీరవాణి కలిసి రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’లో కలిశారు. “ఏదో ఏ జన్మలోనో..’ అంటూ సాగే కీరవాణి వ్రాసిన పాటకు ఇళయరాజా స్వరపరిచి సంగీతం అందించగా అనన్య భట్ అద్భుతంగా పాడిన పాటని కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు.

ఆదివారం ఈ సినిమా నుంచి 'రాత్రంతా రచ్చే' అంటూ సాగే మరో లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ వ్రాసిన ఈ పాటని ఇళయరాజా స్వరపరచగా, యువన్ శంకర్ రాజా, నిత్యశ్రీ వెంకట రమణన్‌ కలిసి పాడారు.    

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, రోపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలు చేశారు. ప్రభాస్‌ రీను, చలాకీ చంటి, జబర్దస్త్ రామ్, లత, శ్వేత, ఋషి, చక్రపాణి ఆనంద, అచ్యుత కుమార్‌, మురళీధర్ గౌడ్, అనిల్‌ తదితరులు నటించారు. 

ఈ సినిమాకు కధ, డైలాగ్స్, దర్శకత్వం: పవన్ ప్రభ, సంగీతం: ఇళయరాజా, కెమెరా: రామ్ చరణ్‌, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు. 

మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష