బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘జాక్' సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో గురువారం నుంచి ప్రసారం అవుతోంది.
అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా గత నెల థియేటర్లలో విడుదలైంది. ఇది సూపర్ హిట్ అయ్యింది. ఈ సూపర్ హిట్ మూవీ కూడా నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్ ప్రసారం అవుతోంది.
నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఇది కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా జీ5 ఓటీటీలో ఈ నెల 10 నుంచి ప్రసారం కాబోతోంది.