నెట్‌ఫ్లిక్స్‌లో ఛావా.. శుక్రవారం నుంచే

April 10, 2025


img

ఇటీవల విడుదలైన సినిమాలలో ఛావా సూపర్ హిట్ అయ్యింది. మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ జీవితగాధ, పోరాటాలు, త్యాగాలు కథాంశంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.750 కోట్లు కనెక్షన్స్ సాధించింది. మహారాష్ట్ర ప్రజలు తమ మరాఠా యోధుడి వీరగాథ చూసి పులకించిపోయారు. 

ఇప్పుడు ఈ సినిమా రేపు (శుక్రవారం) నుంచి నెట్‌ ఫ్లిక్స్ ఓటీటీలోకి ప్రసారం కాబోతోందని ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వికీ కౌశల్ శంభాజీగా అద్భుతంగా నటించగా ఆయన భార్యగా నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. 

ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్త, వినీత్ కుమార్‌ సింగ్, డయానా పెంటీ, సంతోష్ జువెకర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. 


Related Post

సినిమా స‌మీక్ష