మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్న నటీనటులందరి ఫస్ట్-లుక్ పోస్టర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమాలో మల్లుగా నటిస్తున్న రఘుబాబు, కుమారదేవ శాస్త్రిగా నటిస్తున్న శివబాలాజీ పోస్టర్స్ కూడా విడుదల చేశారు.
హిందీలో ‘మహా భారత్’ సీరియల్ అద్భుతంగా తీసి యావత్ దేశ ప్రజలను ఎంతగానో మెప్పించిన బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లో శివపార్వతులుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, రుద్రుడుగా ప్రభాస్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటి నుపూర్ సనన్ మంచు విష్ణుకి జోడీగా నటిస్తోంది. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని 5 భాషల్లో నిర్మిస్తున్న కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.