పాపం లైలాకి ఎన్ని కష్టాలో?

February 13, 2025


img

విశ్వక్‌ సేన్‌ అమ్మాయిగా నటించిన ‘లైలా’ సినిమా భారీ అంచనాలు, వివాదాల నడుమ వాలంటైన్స్ డే సందర్భంగా రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే నటుడు పృధ్వీ చేసిన వ్యాఖ్యలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు #బాయ్‌కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నాయి.

ఇప్పుడు లైలాకి పైరసీ సమస్య కూడా మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ విడుదలైన వెంటనే ఆన్‌లైన్‌లో పెట్టేస్తామని బెదిరిస్తూ కొందరు దుండగులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. గేమ్ చేంజర్‌, తండేల్ రెండు సినిమాలకు పైరసీ బారిన పడి నష్టపోయాయి.

కనుక లైలా దర్శకనిర్మాతలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. “ఈ సినిమా థియేటర్లలో చూసి ఆనందించాల్సిన సినిమా. ఎవరైనా పైరసీ కాపీలను విడుదల చేస్తే చూడకుండా ఆ వివరాలు మాకు తెలియజేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. మాకు సోషల్ మీడియాలో @blockxtechs హ్యాండిల్ లేదా report@ blockxtechs.com ఈమెయిల్ ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ సినిమాలో విశ్వక్ సేన్‌ ఫస్ట్ ఆఫ్‌లో సోనూగా , సెకండ్ ఆఫ్‌లో లైలా అనే అమ్మాయిగా నటించాడు. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ నటించింది. 

ఈ సినిమాకు సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ ప్రసాద్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష