యువహీరో నాగశౌర్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఈరోజు కొత్త సినిమా ప్రారంభించాడు. రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు బ్యాడ్ బాయ్ కార్తీక్‌గా పేరు ఖరారు చేసి ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
కొత్తగా సినీ నిర్మాణ రంగంలోకి వచ్చిన వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్:1గా బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోందని తెలిపారు.
ఈ సినిమాకి కధ దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్), సంగీతం: హ్యారీస్ జయరాజ్, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రామాంజనేయులు, స్టంట్స్: సుప్రీం సుందర్ పృధ్వీ, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి కలిసి నిర్మిస్తున్నారు.