విశ్వక్ సేన్ పుట్టినరోజు ఒకేసారి రెండు సినిమాలు అప్‌డేట్స్

March 29, 2024


img

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేస్తున్న రెండు సినిమాలకు సంబందించి అప్‌డేట్స్ ఒకేసారి ఇవాళ్ళ వచ్చాయి. 

ఇది కాక విశ్వక్ సేన్‌ చేస్తున్న 10వ సినిమా పేరు ‘మెకానిక్ రాకీ’ అని నిన్ననే ప్రకటించాడు. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ నేడు విడుదల చేశారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం రవితేజ ముళ్ళపూడి, సంగీతం: జేక్స్ బిజయ్, కెమెరా: మనోజ్ కాటసాని, యాక్షన్: సుప్రీం సుందర్. ఈ సినిమాను ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్‌ తాళ్ళూరి నిర్మించబోతున్నారు.   

విశ్వక్ సేన్ 12వ సినిమా పేరు ‘లైలా’ అని ఈ సినిమాను నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ స్త్రీ వేషంలో నటించబోతునట్లు ‘హెర్ వరల్డ్’ అంటూ చిన్న హింట్ కూడా ఇచ్చింది. పోస్టర్‌లో కూడా మేకప్ సామాను చూపారు. ఈ సినిమాకు రామ్ నారాయణ్‌ దర్శకత్వం, తనిష్క్ బాగ్చీ సంగీతం, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జంటగా ఆకాంక్ష శర్మ నటించబోతున్నట్లు సమాచారం. 

విశ్వక్ సేన్‌, నేహా శెట్టి జంటగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 17న విడుదల కాబోతోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాజర్, అంజలి, సాయి కుమార్, హైపర్ ఆదీ, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, పృధ్వీరాజ్‌ పాలపర్తి, మాయాన్ పారక్, ఆయెషా ఖన్నా ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మదాడి చేస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష