ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌... విజయ్‌ విశ్వరూపం! చూసి తీరాల్సిందే!

March 28, 2024
img

విజయ్‌ దేవరకొండని సరిగ్గా వాడుకుంటే ఓ ‘అర్జున్ రెడ్డి’ ఓ ‘గీతా గోవిందం’ అవుతుంది. వాడుకోవడం చేతకాకపోతే ‘లైగర్’గా మిగిలిపోతుంది. ఈ బంగారు కొండని ఎలా వాడుకోవాలో దర్శకుడు పరశురామ్ కంటే ఎవరికి బాగా తెలుసు?

వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ట్రైలర్‌ గురువారం ఉదయం విడుదలైంది. అది చూస్తే పరశురామ్ విజయ్‌ దేవరకొండని ఎంత గొప్పగా వాడుకున్నాడో అర్దమవుతుంది.

కేవలం ఒకటిన్నర నిమిషాల నిడివి గల ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌లో విజయ్‌ దేవరకొండ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్ని సన్నివేశాలను ఇంత చిన్న ట్రైలర్‌లో దట్టించి వదిలారు.

ట్రైలర్‌ చూస్తే రౌడీ స్టార్ అభిమానులు ఆనందంతో పొంగిపోతారు. అంత అద్భుతంగా ఉంది ట్రైలర్‌. మరి ఫ్యామిలీ స్టార్‌ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటే ఏప్రిల్‌ 5 వరకు వేచి చూడాల్సిందే. 

ఈ సినిమాలో దివ్యాంక్ కౌశిక్, వాసుకి, రోహిణీ అట్టాంగడి,అభినయ, అజయ్ ఘోష్, జబర్దస్ట్ రామ్ ప్రసాద్, కోట జయరాం ముఖ్యపాత్రలు చేశారు.  

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. 


Related Post