నేడు బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం... పూర్వ వైభవం సాధించగలదా?

April 27, 2024


img

నేడు బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఒకవేళ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే నేడు ఎంతో కోలాహలంగా ఉండేది. కానీ ప్రతిపక్షంలోకి మారినందున పెద్దగా సందడి లేకుండానే జరిగిపోతోంది. లోక్‌సభ ఎన్నికల హడావుడి, ఆ ఒత్తిడి వలన కూడా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేసుకోలేకపోతోందని భావించవచ్చు. 

బిఆర్ఎస్ పార్టీ వైభవాన్ని అందరూ చూశారు. అలాగే శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత దాని దయనీయ పరిస్థితిని కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల పరీక్షలో నెగ్గకపోతే బిఆర్ఎస్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. కనుక ఈ ఎన్నికలు దానికి అగ్నిపరీక్ష వంటివే అని చెప్పవచ్చు. 

కేసీఆర్‌ చెప్పుకొంటున్నట్లు ఒకవేళ ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కనీసం 10 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగితే, పార్టీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని స్పష్టమవుతుంది. అదే సమయంలో రేవంత్‌ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని స్పష్టమవుతుంది. 

ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలు గెలుచుకొని బిఆర్ఎస్ 2-3 సీట్లకు పడిపోతే రేవంత్‌ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించిన్నట్లే అవుతుంది. 

కనుక కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌లలో గెలిచే పార్టీ రెండో దానిని దారుణంగా దెబ్బతీయబోతోంది. కనుక బిఆర్ఎస్‌ పార్టీ రెండు దశాబ్ధాల చరిత్రలో ఈ పెను సవాలును ఎదుర్కొని పూర్వవైభవం సాధిస్తుందా లేదా అనేది లోక్‌సభ ఎన్నికల తర్వాత చూడవచ్చు.


Related Post