ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌ రేపే...

March 27, 2024


img

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా ట్రైలర్‌ గురువారం విడుదల కాబోతోంది. ఈ విషయం విజయ్‌ దేవరకొండ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

హైదరాబాద్‌, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌లో ఉదయం 11 గంటలకు, తిరుపతిలో పీజీఆర్ సినిమాస్‌లో సాయంత్రం 6 గంటలకు ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌ విడుదల కార్యమానికి తాను రాబోతున్నట్లు విజయ్‌ దేవరకొండ తెలియజేశారు. 

విజయ్‌ దేవరకొండకు ‘గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా వస్తున్నందున దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. 

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్‌ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష