తిరుమలలో రామ్ చరణ్‌ ... ఆన్‌లైన్‌లో జరగండి సాంగ్

March 27, 2024


img

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సుప్రభాతసేవలో పాల్గొన్నారు. ముందే చెప్పిన్నట్లుగా ఈరోజు ఉదయం 9 గంటలకు గేమ్ చేంజర్‌ సినిమా నుంచి ‘జరగండి...’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్ చేశారు. 

శంకర్ దర్శకత్వంలో సినిమా కనుక దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. జరగండి పాటకు వేసిన అద్భుతమైన, రంగురంగుల సెట్‌ చూస్తే సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గదని స్పష్టం అవుతుంది. 

అనంత శ్రీరామ్ వ్రాసిన ఈ పాటకు ధమన్ స్వరపరచగా, దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ జరగండి...జరగండి అంటూ హుషారుగా పాడారు. ఈ పాటకు రామ్ చరణ్‌, కియరా అద్వానీ బృందం డ్యాన్స్ కూడా చాలా ఆకట్టుకొనేలా ఉంది. అయితే పాటకు వేసిన సెట్, డ్యాన్స్ చాలా బాగున్నప్పటికీ పాట లిరిక్స్, సంగీతం ఏమంత గొప్పగా లేవు. రొటీన్ పాటలా అనిపిస్తాయి. 

గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు హీరోయిన్‌గా కియరా అద్వానీ నటిస్తున్నారు. కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కాబోతోంది.

 


Related Post

సినిమా స‌మీక్ష