ఆర్‌సీ-16 పూజా కార్యక్రమం వీడియో చూశారా?

March 22, 2024


img

మొన్న హైదరాబాద్‌లో రామ్ చరణ్‌ కొత్త సినిమా ఆర్‌సీ-16 పూజా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్న జాన్వీ కపూర్‌, ఆమె తండ్రి బోణీ కపూర్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్‌-జాన్వీ కపూర్‌ జంతపై క్లాప్ కొట్టి లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. 

రామ్ చరణ్‌, మెగా అభిమానుల కోసం ఈ పూజా కార్యక్రమం వీడియోని మైత్రీ మూవీ మేకర్స్‌ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఆ వీడియో మీ అందరి కోసం.... 



Related Post

సినిమా స‌మీక్ష