అల్లు అర్జున్‌కు బెర్లిన్ ఫిలిమ్ ఫెస్టివల్లో అరుదైన గౌరవం

February 17, 2024


img

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు చాలా అరుదైన గౌరవం లభించింది. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్-74లో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా పాల్గొనవలసిందిగా ఆహ్వానం అందింది. దానిలో పాల్గొనేందుకు అల్లు అర్జున్‌ జర్మనీ చేరుకున్నారు. 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా చేసిన ‘పుష్ప ది రైజ్’ సినిమా 2021లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీనిని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు కూడా. ఓ తెలుగు సినిమాని అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శించడమే చాలా గొప్ప విషయం. భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా హాజరుకావడం ఇంకా చాలా గౌరవం. తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా అల్లు అర్జున్‌ అభిమానులకు ఇది చాలా గర్వకారణం. చాలా సంతోషం కలిగించేదే.  

‘పుష్ప ది రైజ్’ సినిమాకి సీక్వెల్‌గా మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా ‘పుష్ప ది రూల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.   

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ‘పుష్ప ది రైజ్’ సినిమాకి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ‘పుష్ప ది రైజ్’ విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష