అమెజాన్ ప్రైమ్‌లో నరేష్‌ ఉగ్రం... జూన్ 2 నుంచి

June 01, 2023


img

నరేష్‌ ఒకప్పుడు బాగా అల్లరి చేస్తూ అల్లరి నరేష్ అనిపించుకొన్నాడు. కానీ నరేష్ అల్లరి మానేసి వరుసపెట్టి సీరియస్ సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ని మార్చుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు స్నేహితుడుగా సీరియస్ పాత్ర చేసి మెప్పించిన నరేష్ ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, నాంది, ఉగ్రం వంటి సీరియస్‌ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు కానీ వాటితో సరైన హిట్ పడటం లేదు. తాజాగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో చేసిన ‘ఉగ్రం’ సినిమా పరిస్థితి కూడా అదే. థియేటర్లలో హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇప్పుడు అన్ని సినిమాలు ఏదో ఓ ఓటీటీలోకి వచ్చి మళ్ళీ అదృష్టం పరీక్షించుకొంటున్నాయి. కనుక ఉగ్రం సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతోంది. జూన్ 2 నుంచి ఈ సినిమా ప్రసారం కాబోతోందని అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ప్రకటించింది. 

ఈ సినిమాలో అల్లరి నరేష్ నిజాయితీ గల శివకుమార్ అనే పోలీస్ ఆఫీసరుగా నటించాడు. అపర్ణా మేనన్ అతని భార్యగా నటించింది. ఓ కారు ప్రమాదంలో నరేష్ జ్ఞాపకశక్తి కోల్పోతాడు. ఆ తర్వాత అతని భార్య, పిల్లలు కనబడకుండా పోతారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేదే ఈ సినిమా కధ. 


Related Post

సినిమా స‌మీక్ష