సెప్టెంబర్‌ 1వ తేదీన ఖుషీ అవుదామా?

March 23, 2023


img

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. అయితే ఇంతవరకు ఈ సినిమా గురించి అప్‌డేట్స్ ఏవీ లేకపోవడంతో విజయ్ దేవరకొండ అభిమానులు చాలా అసహనంగా ఉన్నారు. నిన్న ఉగాదికైనా తమను ఖుషీ చేస్తారని ఎదురుచూస్తే ఏ కబురు లేకపోవడంతో చాలా నిరాశ చెందారు. కానీ ఇవాళ్ళ హటాత్తుగా సెప్టెంబర్‌ 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించి, దాంతోపాటు హీరోహీరోయిన్ల ఓ చక్కటి పోస్టర్‌ కూడా విడుదల చేశారు.   

ఖుషీలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడేకర్, లక్ష్మి, శరణ్యా అయ్యంగార్, రోహిణి ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమా మొదటి షెడ్యూల్ కశ్మీర్‌లో మొదలుపెట్టి పూర్తిచేసిన తర్వాత సమంత అనారోగ్యం కారణంగా మళ్ళీ మొదలవలేదు. కానీ ఇటీవల ఆమె పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. 

నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా మురళి జి, సంగీతం హషమ్ అబ్దుల్ వాహేబ్ అందిస్తున్నారు. 

మలయాళ నటుడు దేవ్ మోహన్ శకుంతల, దుష్యంతులుగా చేస్తున్న శాకుంతలం సినిమాని దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష