నన్నూ అందుకు ఒప్పుకోమని ఒత్తిడి చేశారు: నయనతార

January 31, 2023


img

విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన కనెక్ట్ సినిమా ప్రమోషన్స్‌లో నయనతార మాట్లాడుతూ, ఆనాడు సినీ పరిశ్రమలోకి కొత్తగా ప్రవేశించినప్పుడు, సినిమాలలో అవకాశాలు కావాలంటే దర్శకులు, నిర్మాతలతో గడపాల్సి ఉంటుందని ఒత్తిడి చేసేవారని చెప్పారు. అయితే తాను నిర్మొహమాటంగా వారిని తిరస్కరించానని, తన స్వీయ ప్రతిభతోనే అందరినీ మెప్పించి సినిమా అవకాశాలు పొందానని తెలిపారు. సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ సమస్య హీరోయిన్లు అందరూ ఎదుర్కొన్నవారేనని నయనతార తెలిపారు. అయితే నటీమణుల ఆలోచనా విదానం, వారి ప్రవర్తన సరిగాలేకపోయినా ఇటువంటి ఇబ్బందులలో చిక్కుకొంటారని నయనతార తెలిపారు. 

అయితే మిగిలిన నటీమణులు ఈ సమస్యపై సోషల్ మీడియాలో పోరాడుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయి ఇప్పుడు మాట్లాడటం వలన ఉపయోగం లేదు. కానీ అందరి దృష్టిని ఆకర్షించే ఈ సమస్య గురించి మాట్లాడి తన కనెక్ట్ సినిమా ప్రచారానికి వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష